మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (15:01 IST)

అమ్మాయిలపై పాటలు రాసే వారందరిపై కేసులు పెడతా.. మాధవీలత

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. అదేసమయంలో ఓ రేంజ్‌లో వివాదాన్ని రేపుతున్నాయి. ప్రధానంగా ఈ చిత్రంలోని సమంత నటించిన ఐటమ్ సాంగ్ మరింత వివాదాన్ని రేపింది. 
 
ఈ పాటను తొలగించాలని ఏపీలో పురుషుల సంఘం ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. మగాళ్లంతా చెడ్డోళ్ళంటూ అర్థం వచ్చేలా ఆ పాట ఉందని, దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు.. ఆ పార్టీకు డ్యాన్స్ చేసిన సమంతపై కూడా కేసు పెట్టింది. 
 
ఈ పాటపై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశంపై ఆమెప ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. "వాయమ్మె 'పుష్ప' మూవీ సాంగ్ మీద కేస్ అంటగా, ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి. నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. 
 
'పుష్ప'లోని 'రారా సామీ' పాట కేసు వేస్తా. ఏంటి ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పోలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచిన చోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. 'ఛ నాకు నచ్చలే. నేను పెడతా కేసు. అంతే.. తగ్గేదేలే' అంటూ ఆమె పోస్ట్ చేశారు.