సమంత ఇష్టపడి చేసింది - పబ్లిసిటీ జాప్యం మా తప్పిదమే - అల్లు అర్జున్ (video)
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఈనెల 17న విడుదల కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ, ముత్తం శెట్టి మీడియా నిర్మించింది. ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను అల్లు అర్జున్ పబ్లిసిటీని భుజాన వేసుకున్నారు. మరోవైపు ఓవర్‌సీస్‌కు సినిమాను అనుకున్న టైంకు పంపేలా దర్శకుడు సుకుమార్ ముంబైలో సాంకేతిక పనిలో వున్నారు.
అందుకే మంగళవారం పగలు చెన్నైలో అల్లు అర్జున్ అక్కడి మీడియాతో సినిమా గురించి పాలుపంచుకున్న ఆయన ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ, సినిమా నిర్మాణానికి 23 నెలలు పట్టిందనీ, అందులో 9 నెలలు కోవిడ్ వల్ల జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో నటించిన పుష్పరాజ్ పాత్రకోసం చిత్తూరు స్లాంగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి చాలా హోం వర్క్ చేశానని తెలిపారు.
- పుష్పరాజ్ పాత్ర ప్రభావం నామీద లేదు. కానీ నిజజీవితంలో పాత్ర మాట్లాడే భాష, కట్టుబాటు అనేవి రోజువారి కార్యక్రమాలపై ప్రభావం చూపింది. అలా కొద్దిరోజులు నామీద వుంది.
- పాటలు గురించి చెబుతూ, ఇందులో అన్నీ పాటలు హిట్టయ్యాయి. చంద్రబోస్ చక్కటి సాహిత్యం అందించారు. ఇందులో వున్న ఐదు పాటలకు ఐదు సన్నివేశాలకు ఆయన రాసిన విధానం చాలా గొప్పది. సినిమాకు బలం చంద్రబోస్ సాహిత్యం.
- ఇక, సమంత ఇందులో ఓ పాటలో నర్తించింది. సహజంగా కొంతమందికి ఇలాంటి డాన్స్ చేయాలంటే కొన్ని పరిమితులు, ఆంక్షలు విధిస్తారు. అవేవీలేకుండా. అన్నింటికీ సర్దుకుని పాత్ర బాగుందని చేసింది.
- ప్రమోషన్ గురించి చెబుతూ, మేమనుకున్నప్పుడు రెగ్యులర్ సినిమాకు జరిగినట్లే అవుతుందని భావించాం. కానీ మా జడ్జిమెంట్ రాంగ్ అని తెలిసేసరికి కాస్త ఆలస్యమైంది. అన్నారు.
పుష్పరాజ్ ఎలా వుండబోతున్నాడు? అన్న ప్రశ్నకు బదులిస్తూ..
నాకు కొంచెం కంగారుగానూ వుంది. హిట్ అవుతుందని వుంది. రిలీజ్ తర్వాత మిమ్మలి కూడా అడుగుతాను.
- సుకుమార్ రంగస్థలం తీశాక అంత హిట్ అవుతుందని అనుకోలేదు. అలాగే నేను చేసిన అల వైకుంఠపురంలో సినిమా కూడా పెద్ద రేంజ్‌లో హిట్ అవుతుందని ఊహించలేదు. పుష్ప కూడా హిట్ అనుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ చేస్తే అది మాకు బోనస్‌గా ఫీలవుతాం అని తెలిపారు.