బుధవారం, 21 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 10 డిశెంబరు 2025 (22:54 IST)

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

Saudi Rains
సౌదీ అరేబియాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాస్తవానికి ఈ వర్షాల ఆగమన కాలం మారిందని, కాలానుగుణ వర్షపాత నమూనాలలో గుర్తించదగిన మార్పును ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వార్షిక గరిష్ట స్థాయి వర్షాలు నవంబర్ నుండి డిసెంబర్ వరకు కురుస్తున్నట్లు సౌదీ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
ఈ మార్పు దేశం అంతటా మారుతున్న వాతావరణ ప్రవర్తనను ప్రతిబింబిస్తుందని, స్థానిక వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేసే వాతావరణ మార్పులను బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం వుందని వారు అంటున్నారు. భారీ వర్షాలతో జెడ్డా నగరం విలవిలలాడుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా ఇంటర్నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ ఈవెంట్ రద్దు చేసారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బైటకు రావద్దని 8 ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసారు.