శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:43 IST)

నా దృష్టిలో వారే గొప్ప డాన్స‌ర్లు - అల్లు అర్జున్

Allu arjun-Devisri and others
అల్లు అర్జున్ అన‌గానే చిరంజీవి త‌ర్వాత గొప్ప డాన్స‌ర్ అనేది టాలీవుడ్‌లో తెలిసిందే. తాజాగా ఆయ‌న సినిమా `పుప్ప‌` త‌మిళంలో కూడా విడుద‌ల‌వుతుంది. ఈరోజే ఉద‌యం అక్క‌డ ప్ర‌మోష‌న్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ,  తమిళ చలన చిత్ర పరిశ్రమలో కమల్‌ హాసన్‌, విజయ్‌, ధనుష్‌, శింబు, శివకార్తికేయన్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారనేది నా అభిప్రాయం. శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ సినిమాని ఇటీవల చూశాను. ఆ సినిమా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులోని ‘చెల్లమ్మ’ పాట నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అన్నారు.
 
అల్లు అర్జున్ సినిమాలు కోలీవుడ్‌లో డ‌బ్ అవుతుండేవి. ఇప్పుడు అక్క‌డ కూడా ఒకేసారి విడుద‌ల‌వుతుంది. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ, పుప్ప ద్వారా కోలీవుడ్‌లో విజయం అందుకోవడమే తన కల అని పేర్కొన్నారు. 
- పుష్ప పాత్ర గురించి చెబుతూ,  మేకప్‌ వేసుకునేందుకు 2 గంటలు, దాన్ని తీసేందుకు 40 నిమిషాల సమయం పట్టేది. ఫహద్ ఫాజిల్‌ నటన అద్భుతం. ఆయన పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయా. తన గురించి రేపు మ‌ల‌యాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌తాను అంటూ తెలిపారు.