గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (22:21 IST)

నాన్ వెజ్ మీల్స్ లా ఉంటుంది పుష్ప సినిమా: సునీల్

Sunil
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు. ఈ సినిమాలో మంగళం శ్రీను పాత్రల్లో నటించిన సునీల్.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎనర్జిటిక్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ' ఇదే వేదికపై అల వైకుంఠపురంలో సినిమా గురించి ఒక మాట చెప్పాను.. చక్కటి విందు భోజనంలా ఉంటుంది మీరు టికెట్ కొట్టుకుని వస్తే చాలు.. పండక్కి మీ ముందుకు వస్తున్నాము అని చెప్పాను. ఇప్పుడు అదే చెబుతున్నాను ఇది పెళ్లి తర్వాత వచ్చే రిసెప్షన్ లాంటి సినిమా. కక్క ముక్క బాగా ఉంటుంది. మంచి నాన్ వెజ్ మీల్స్ లాంటి సినిమా పుష్ప. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వారంరోజుల పాటు మిమ్మల్ని బాగా హాంట్ చేయడం ఖాయం. 
 
సాధారణంగా ఎవరైనా విలన్ అవ్వాలంటే నేరుగా అయిపోతారు. కానీ నేను 300 సినిమాలు కమెడియన్ గా చేసి.. అందులో 10 సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత విలన్ అయ్యాను. దయచేసి నా ముందు సినిమాలను గుర్తుపెట్టుకుని ఈ సినిమా చూడకండి. అల్లు అర్జున్ ఫోటో తీసుకెళ్ళండి. నా గతం గుర్తుకు వస్తే వెంటనే బన్నీ ఫోటో చూడండి. మీరు కొత్తగా చూస్తేనే కొత్తగా చేయగలను. ఖచ్చితంగా పుష్ప సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు..' అని తెలిపారు.