గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జులై 2025 (20:23 IST)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

CMs Meet
CMs Meet
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన కీలక సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించి ఢిల్లీ జరిగిన ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది.రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించింది.
 
13 అంశాలను ఎజెండాలో ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం.. పాలమూరు-రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత చేవెళ్ల సహా.. కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. 
 
శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.