1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (18:55 IST)

ఎవ‌రూ మ‌న‌ల్ని రీప్లేస్ చేయ‌లేరు - రష్మిక మందన్నా

Rashmika Mandanna
అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా సోమ‌వారంనాడు ఆమె ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది.
 
అల్లు అర్జున్ తో న‌టించాల‌నే కోరిక నెరవేరిందిగా ఎలా అనిపిస్తుంది?
గీత గోవిందం ఫంక్ష‌న్‌లో అల్లు అర్జున్ గారు వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌సులో అనుకున్నా. ఆయ‌నతో న‌టించాల‌ని. డెస్టిని వెంట‌నే నెర‌వేర్చింది. సుకుమార్ వంటి ద‌ర్శ‌కుడితో రెండు భాగాలు వున్న సినిమాలో న‌టిస్తాన‌ని ఊహించ‌లేదు.
‘పుష్ప’ ఏ త‌ర‌హా సినిమా?
పుష్ప పూర్తిగా మరో ప్రపంచంలా వుంటుంది. చాలా కొత్తగా క్యాచీగా ఉంటుంది. కచ్చితంగా పుష్పను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పుష్ప అంటే మరో వరల్డ్. నాలుగు సినిమాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకే పడింది మా టీమ్. అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది.
 
మీ పాత్ర తీరుతెన్నులు ఎలా వుంటాయి?
పుష్పలో పుష్పరాజ్‏కు ప్రేయసి అయిన శ్రీవల్లి పాత్రలో నేను నటించాను. శ్రీవల్లి పాత్ర విషయానికి వస్తే తను కొంచెం కన్నింగ్ అండ్ క్యూట్,   శ్రీవల్లి ఉన్నదే పుష్పరాజ్ కోసం. శ్రీవల్లి పాత్ర చాలా బాగుంటుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది.
 
పుష్ప కథ విన్నప్పుడు మీకేం అనిపించింది ?
 
సుక్కు సర్ నాకు అసలు కథ చెప్పరు. అయితే, ఈ సినిమాకి డైరెక్టర్ సుక్కు సర్. ఆయన గురించి మనందరికీ తెలుసు. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్స్ చూశాను. చాలా గర్వంగా అనిపించింది. ఆ క్రెడిట్ మొత్తం సుక్కు సర్ కే దక్కుతుంది.
 
శ్రీవల్లి పాత్ర కోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ?
 
అన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేశాను. చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నాను. కానీ సెట్ లో డైలాగ్స్ మారినప్పుడు, అలాగే సీన్స్ లో మార్పులు వచినప్పుడు కూడా యాసను నేర్చుకుంటూనే ఉన్నాను. శ్రీవల్లి పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తోంది. 
 
మీ చేతికి టాటూస్ పెట్టారు. దాని అర్థం ఏమిటి?
 
ఇర్రే ప్లేస‌బుల్‌ అని వేసుకున్నా.ఎవ్వ‌రూ మిమ్మ‌ల్ని రీప్లేస్ చేయ‌లేరు. ఎందుకంటే మ‌న‌మంద‌రం ఎవ‌రిక‌న్నా త‌క్కువ కాదు. 
 
‘సామీ సామీ’ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ చేసేటప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు ?
 
నిజానికి నాకు సామీ సామీ సాంగ్ చేయడం చాలా కష్టం అయింది. ఎందుకంటే.. డ్యాన్సింగ్ ఒకలా ఉంటుంది, అలాగే మూమెంట్స్ ఎమోషన్ మ్యాచ్ చేయాలి. పైగా సాంగ్ లో మరో డిఫరెంట్ లెవల్ ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది.
 
మహేష్ తో నటించారు. ఇప్పుడు బన్నీతో నటించారు. ఎలా అనిపించింది ?
 
వాళ్లిద్దరూ పెద్ద స్టార్స్.  ఇద్దరూ డిఫరెంట్ పర్సన్స్. అలాగే ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ కూడా వేర్వేరుగా ఉంటుంది. నా వరకు అయితే, నేను మహేష్ సర్ దగ్గర నుంచి కొన్ని కోర్చుకున్నాను. అలాగే బన్నీ గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను.
 
 మీ కెరీర్ పై మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ?
మా అమ్మ ఎప్పుడు చెప్పే మాట.. ఎక్కువ వర్క్ చేయకు అని, ఇలా చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. బట్, నేను ప్రస్తుతం ఇంత హ్యాపీగా, ఇంత జాలీగా వర్క్ చేస్తున్నాను అంటే.. కారణం మా పేరెంట్స్ నే.
 
సమంత ఈ సినిమా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. భవిష్యత్తులో మీరు కూడా అలాంటి సాంగ్స్ చేస్తారా ?
 
లేదు.. బట్, సామ్ చేసిన సాంగ్ లో ఆమె లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. అలాగే సమంత డ్యాన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ సాంగ్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.