గురువారం, 11 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (19:51 IST)

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

murder
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. తమ అమ్మాయిని ప్రేమిస్తున్న ఓ యువకుడుని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. ఒక యేడాది కాలంగా తాను మీ అమ్మాయికి దూరంగా ఉంటున్నానని చెప్పినప్పటికీ యువతి బంధువులు వినిపించుకోలేదు కదా క్రికెట్ బ్యాట్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో బీటెక్ విద్యార్థి జ్యోతి శ్రవణ్ సాయి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు ఈ క్రమంలో యువతి తరపు బంధువులు మంగళవారం హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్ళారు.
 
ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి.. దాడి చేశారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రవణ్ సాయి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 
 
ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా.. ఏడాదిగా ఆమెను కలవలేదని ఎదురు తిరగడంతో క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టామని, అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని ఆసుపత్రికి తరలించామని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.