1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. tamilandu : lover killed his girl

ప్రేమికురాలిని దిండుతో చంపేసిన ప్రియుడు

murder
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ దారుణం జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయిని ప్రియుడు హత్య చేశాడు. దిండుతో గట్టిగా అదిమిపట్టి చంపేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
సేలం జిల్లా అస్తంబట్టి సమీపం సుబ్రహ్మణ్యపురానికి చెందిన భారతి(34) ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. స్థానికంగా ట్యూషన్‌ సెంటర్‌ నడుపుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉదయశరణ్‌(49), భారతి ప్రేమించుకుంటున్నారు. ఇదిలావుండగా, వీరి మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. 
 
దీంతో క్షణికావేశానికి గురైన ఉదయశరణ్ ఆమె ముఖాన్ని దిండుతో అదమడంతో స్పృహ కోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఉదయశరణ్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పంచాయతీరాజ్ వ్యవస్థను రాజులా పాలిస్తున్నారు: పంచాయతీ కార్యదర్శి ఉద్వేగం (video)