మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:40 IST)

మ‌గాళ్ళంతా వంక‌ర బుద్ధి కాదు - చంద్ర‌బోస్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

Chandrabose
ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పాట `పుష్ప‌` సినిమాలోని స‌మంత ఐటెంసాంగ్‌. 
- కోక కోక కోక క‌డితే కొర‌కొర‌మ‌ని చూస్తారు. పొట్టి పొట్టి గౌను వేస్తే ప‌ట్టీ ప‌ట్టీ చూస్తారు. కోకా కాదు గౌను కాదు. మీ క‌ళ్ళ‌లోనే అంతా వుంది. మీ మ‌గ‌బుద్దే వంక‌బుద్ది.. ఊ.. అంట‌.. వా..వా.. అంటూ సాగిన ఈ పాట‌లో మ‌గ‌వారిని కించ‌ప‌రిచేవిధంగా వుందంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పురుషుల సంఘం కోర్టులో కేసు వేసింది అనేది తాజా అంశం. 
 
దీనిపై నెటిజ‌న్లు విప‌రీతంగా స్పందిస్తున్నారు. ఇక కొన్ని సోష‌ల్‌మీడియాలో స‌మంత ఐటెం సాంగ్ ఎందుకు చేసింది? అంటూ తెగ ఫీల‌యిపోతున్నారు. ఇక ఈ పాట‌ను రాసింది చంద్ర‌బోస్‌. ఆయ‌న సాహిత్య గురించి తెలియందికాదు. కాలేజీడేస్‌లో స్టూడెంట్స్ అంతా ఫేర్‌వెల్ సంద‌ర్భంగా గురువుల‌కు వీడ్కోలు ప‌లికే సంద‌ర్భంలో ఆయ‌న రాసిన పాట‌కు ప్రేక్ష‌కులేకాదు, మేథావుల హృద‌యాల‌నుత‌ట్టి లేపింది. అలాంటి చంద్ర‌బోస్ క‌లం నుంచి వ‌చ్చిన `మగ బుద్ది వంక‌ర బుద్ధి` గురించి రాస్తే అది పెద్ద రాద్దాంతం అయింది.
 
దీనిపై చంద్ర‌బోస్ వెబ్ దునియాతో ప్ర‌త్యేకంగా స్పందించారు. నేను రాసిన దానిలో ఏమంత విరుద్ద‌మైన పదాలు లేవు. ఈ పాట‌లో....
-పురుషులందు పుణ్య‌పురుషులు వేర‌యా. అని కూడా రాశాను. 
మ‌గ బుద్ధి వంక‌ర బుద్ధి..అని మ‌రో చోట రాశాను. 
ఇది సందర్భానుసారంగా వ‌చ్చిన పాట. ఇందులో ఎవ‌రినీ కించ‌ప‌ర‌లేదు.
- -పురుషుల్లో అంద‌రూ పుణ్య‌పురుషులు కారు, అదేవిదంగా అంద‌రిదీ వంక‌ర‌బుద్ధికాదు అనే అర్థం వ‌స్తుంది. ఏది ఏమైనా దీన్ని ఇలా వారి భావాలకు మార్చుకోవ‌డం నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అన్నారు.
విశ్లేష‌కులు ఏమంటున్నారంటే!
ఈ పాట‌పై వ‌చ్చిన వందంతుల‌పై సీని విశ్లేషకులు తేలిగ్గా తీసుకోవాల‌ని సూచించారు. ఇలాంటి కేసులు నిల‌వ‌డ‌వు. ఎవ‌రో కొంత‌మంది ఫేమ్ కావ‌డానికి సినిమా విడుద‌ల‌కు ముందు ఇలా తెర‌ముందుకు రావ‌డం గ‌తంలో ప‌లు సంద‌ర్భాల్లోనూ జ‌రిగింది. సినిమా చూశాక అప్పుడు ఏదైనా లోపాలుంటే అడ‌గ‌వ‌చ్చు అంటూ తెలియ‌జేస్తున్నారు.