శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (17:46 IST)

చంద్ర‌బోస్‌, స‌మంత పోస్ట‌ర్ల‌కు క్షీరాభిషేకం

Chndrabose-Samantha
పాటంటే మాట‌ల పొందిక కాదు. ఆలోచ‌న‌ల సంచిక, స్పూర్తి ర‌గిలించే క‌ణిక అంటూ త‌న‌దైన పాట‌ల‌తో ఎంతోమందినిచైత‌న్య ప‌రిచిన గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్‌. పుష్ప ప్రీరిలీజ్ వేడుక ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ప్పుడు ఆయ‌న గురించి అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బోస్ మాట్లాడుతూ, సినిమాల్లో తాను రాసిన గీతాల క్ర‌మాన్ని వివరిస్తూ అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూరించారు.

 
- బ‌ల‌మైన‌భావ‌జాలం ఉంటూనే తేలికైన మాట‌ల‌తో అర్థ‌మ‌య్యేలా తాను రాసిన గీతాలు వుంటాయంటూ ఒక్కో పాట‌ను క్లుప్తంగా విశ‌దీక‌రించారు.  మౌనంగా వుండ‌మ‌ని మొక్క  నీకు చెబుతుంది., కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..  పోటీ వున్నా కానీ గెలుపొంది తీరాలి.. చరిత్ర‌లో నీకు కొన్ని పేజీలు వుండాలి. అంటూ ర‌క‌ర‌కాల నేప‌థ్యాల‌తో పాట‌లు రాసిన ఆయ‌న పుష్ప‌లో `వంక‌ర బుద్ధి..అంటూ ఒక‌డేమో ఇలా అంటాడు. అనే అర్థంలోనే పాట‌ను రాశారు.


- `ఊ అంటావా.. అనే ఈ పాట‌కు ఓ ప్ర‌త్యేక‌త వుందంటూ, గ‌తంలో ఓ పాట‌ను ఇళ‌య‌రాజా మూడు స్వ‌రాల‌తో స్వ‌ర‌ప‌రిస్తే ఇప్పుడు దేవీశ్రీ ప్ర‌సాద్ నాలుగు స్వ‌రాల‌తో స్వ‌ర‌ప‌రిచారంటూ.. ఆ పాట నేప‌థ్యాన్ని కృషిని చంద్ర‌బోస్ విపులంగా వివ‌రించారు. ఈ మాట‌లు ఆయ‌న చెబుతుంటే ప్రేక్షక్షులు క‌ర‌తాళ‌ధ్వ‌నుల‌తో అభినంద‌న‌లు తెలిపారు.

 
- ఇక ఆ పాట ప్రోమోకే అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. మిలియ‌న్ల కొద్దీ ప్ర‌జ‌ల‌కు చేరింది. ఒక‌ర‌కంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 

 
- కానీ ఆ పాట  మ‌గ‌జాతిని కించ‌ప‌రిచే విధంగా వుందంటూ కొంద‌రు ముందుకువ‌చ్చారు. దాన్ని సోష‌ల్ మీడియా హైలైట్ చేసింది. 

- మ‌రోవైపు, మ‌ద్య‌నిషేదం అంటూ ఓనాడు ఎలుగెత్తిన మ‌హిళా లోకం  ఈ పాట రాసిన చంద్ర‌బోస్‌కు, న‌ర్తించిన స‌మంత‌కు అమ‌రావ‌తిలోని కోదండరామ ఆలయంలో క్షీరాభిష‌కం చేయ‌డం విశేషం. 

 
- తాళ్ళూరు గ్రామ పరసరంలోని కోదండరామ ఆలయంలో ఇటీవల విడుదల అయిన ఊ అంటావా పాటలో నర్తించిన సమంతకు, రచయిత చంద్రబోసుకు స్థానిక మహిళామండలి సభ్యులు అర్చన చేసి వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
 
ఈ సందర్భంగా వారు పురుషుల దురహంకారాలను ,దుశ్చ్యర్యలను ఎత్తిచూపే పాటపై వివాదాన్ని రాజేసిన పురుషసంఘం 'వంకరబుద్ది'ని మరొక్కసారి దుయ్యబట్టారు.మహిళల ఐకమత్యం వర్థిల్లాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పుష్ప మొదటిరోజు చిత్రాన్ని చూస్తామని,ఊ అంటావా పాటకు విజిల్స్ కూడా వేస్తామని వారు ముక్తకంఠంతో చెప్పడం కొసమెరుపు.