సోమవారం, 15 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 సెప్టెంబరు 2025 (23:51 IST)

హైదరాబాద్ లోనివీఎస్డీ టెక్ పార్క్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ టోస్కానో బ్రాంచ్

Italian Restaurant Opens New Branch in VSD Techpark
హైదరాబాద్: ప్రఖ్యాత ఇటాలియన్ రెస్టారెంట్ అయినటువంటి టోస్కోనా... ఇప్పుడు హైదరాబాద్‌లో తన 2వ అవుట్‌లెట్‌‌ని ప్రారంభించింది. టస్కాన్-ఇన్ స్పైర్‌డ్ పిజ్జాలు, పాస్తాలతో పాటు మరెన్నో అద్భుతమైన రుచుల్ని హైదరాబాద్ వాసులకు అందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో అంతార్జాతీయ అవార్డుల్ని గెల్చుకున్న టోస్కానో ఈ హైదరాబాద్ నగరంలో మరో బ్రాండ్‌ని ప్రారంభించింది. ఇప్పుడు ఇటాలియన్ వంటకాల వెచ్చదనం గచ్చిబౌలిలోని VSD టెక్‌పార్క్‌లో అందుబాటులో ఉంటుంది.
 
టోస్కానోలో, పురాతన యూరోపియన్ పద్ధతులతో తయారుచేయబడిన తాజా ఉత్పత్తులు, చీజ్‌‌లు ప్రీమియం రుచులను అందిస్తాయి. సాఫ్ట్, చాలా మృదువుగా తయారుచేసిన పిజ్జాలు, పాస్తాలు, ఆహ్లాదకరమైన డెజర్ట్‌‌లు.. ఇలా ప్రతి వంటకం సంప్రదాయం, రుచి పట్ల వారి మక్కువను ప్రతిబింబిస్తుంది. చెఫ్ జీన్-మిచెల్ జాస్సెరాండ్, చెఫ్ గౌతం నేతృత్వంలోని చెఫ్‌లు ఇటాలియన్ రుచుల్ని మనకు అద్భుతంగా అందిస్తారు. యూరోపియన్ పద్ధతులు, ఇటాలియన్ ప్రామాణికతను స్థానిక సృజనాత్మక సున్నితత్వాలతో జత చేసి మనకు... ఆధునిక అభిరుచులకు అనుగుణంగా, ఆకర్షణీయంగా టోస్కానో మెనూలను రూపొందిస్తారు. వారి ఇటాలియన్ వంటకాలలో ప్రామాణికతను ఇష్టపడే వారికి, టోస్కానో మిమ్మల్ని గొప్ప సమయానికి ఆహ్వానిస్తుంది.
 
మెనూలోని సిగ్నేచర్ వంటకాల్లో పెప్పరోని పిజ్జా, స్పఘెట్టి కార్బోనారా, పాలకూర, రికోటాతో నింపిన చికెన్ డి టోస్కానో, స్పఘెట్టి అగ్లియో ఒలియో ఇ పెపెరోన్సినో ఉన్నాయి. అదే సమయంలో టోస్కానో స్లింగ్, జింజర్ బెర్రీ ఫిజ్, లిచీ లెమనేడ్ వంటి రిఫ్రెషింగ్ మాక్‌టెయిల్స్ ఉన్నాయి. డెజర్ట్‌ల కోసం, మీరు క్లాసిక్ టిరామిసు నుండి రుచికరమైన చాక్లెట్ కహ్లువా మౌస్ వరకు ఎంచుకోవచ్చు.
 
ఇక బ్రాంచ్ ఇంటీరియర్ విషయానికి వస్తే... ముదురు ఆకుపచ్చ, బంగారు రంగు రంగులు, మట్టి టోన్లు, వెచ్చని లైటింగ్ ఉన్నాయి. ఎత్తైన పైకప్పులు మరియు ఆకర్షణీయమైన అల్ఫ్రెస్కో సీటింగ్ ఈ స్థలానికి యూరోపియన్ ట్రాటోరియా వైబ్‌ను ఇస్తాయి. ఆధునిక హంగులు దీనిని రొమాంటిక్ డిన్నర్‌కి ఆహ్వానించేలా చేస్తాయి. అలాగే ఉల్లాసమైన బ్రంచ్ లేదా క్యాజువల్ విహారయాత్రకు కూడా ఆహ్వానం పలుకుతాయి. మీ భాగస్వామి, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి వచ్చి మంచి ఇటాలియన్ వంటకాలను ఆస్వాదించండి. ఘుమఘమలాడే పిజ్జాలు, రిఫ్రెషింగ్ సాంగ్రియాలు లేదా రిచ్ క్రీమీ పాస్తాలను ఆస్వాదించండి.