సోనియా అలా లాగారు... పార్టీ జెండా ఇలా కిందపడిపోయింది...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ జెండాను ఎగుర వేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఢిల్లీలో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను సోనియా గాంధీ ఎగురవేశారు. ఆ సమయంలో అది సరిగ్గా ఎగరలేదు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న వ్యక్తి సోనియాకు సాయం చేయబోయారు.
ఇంతలో ఆ జెండా ఊడిపోయి పై నుంచి కిందపడిపోయింది. దీంతో ఆ జెండాను మళ్ళీ తాడుకి కట్టి ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు.. అనేక నంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు.