సోమవారం, 3 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : శనివారం, 1 నవంబరు 2025 (15:12 IST)

Parthiban ఫ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో హరీష్ శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన పార్థిబన్

Parthiban gifted to Harish Shankar
Parthiban gifted to Harish Shankar
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పార్థిబన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయిన ఆయన నేటితో షూటింగ్ చివరి రోజు కావడంతో దర్శకుడు హరీష్ శంకర్ కు ప్రతిభకు ముగ్ధులై ఒక ప్రత్యేక మూమెంటోను బహుమతిగా ఇచ్చారు. హరీష్ టేకింగ్ అద్భుతంగా వుందని పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా ఆకట్టుకుందని అనుభవం వున్న దర్శకుడిగా హరీష్ కు క్రుతజ్నతలు తెలియజేస్తున్నానని పార్తీబన్ పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ, గ్రేట్ రచయిత, నటుడు, దర్శకుడు నాకు చిరస్మరణీయ బహుతి ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఆయన ప్రత్యేకంగా తీపిగుర్తుగా ఇచ్చిన జ్నాపనికను భద్రంగా దాచుకుంటానని బదులిచ్చారు.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 2వ చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కింద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నిక్కచ్చి పోలీస్ అధికారిగా కనిపించాడు, గతంలో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలలో ఆయన చేసిన పోలీసు పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కాబట్టి, ఈ పాత్రపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: అయనంక బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి. ప్రొడక్షన్ డిజైన్: ఆనంద్ సాయి, నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ నిర్మాతలు.