Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు
రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి తో మ్యూజిక్ ప్రమోషన్స్ అద్భుతంగా ప్రారంభించింది. ఈ ట్రాక్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ కు చేరుకుంది. ఈ సాంగ్ ను అనుకరిస్తూ క్రికెటర్లు, విదేశీయులు కూడా రీల్స్ చేస్తూ మరింత పబ్లిసిటీ ఇచ్చారు.
అయితే, ఈ సినిమాను 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు. ఆ తేదీని వాయిదా వేస్తూ దర్శకుడు బుచ్చి బాబు సోషల్ మీడియాలో ప్రకటించారు. చిత్ర షూటింగ్‌కు సంబంధించి పెండింగ్ వర్క్స్ ఉండిపోవడంతో ఈ చిత్ర రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఇక ఇప్పుడు అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. లాంగ్ వీకెండ్ కలిసొస్తుండటంతో ఈ డేట్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందని పెద్ది నిర్మాతలు వెల్లడిస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
AR రెహమాన్ సంగీతం అందించిన చికిరి..చికిరి..పాటకు అదిరిపోయే బీట్, ఎనర్జీ, ఫెస్టివల్ వైబ్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది.చికిరి చికిరి ఇప్పటికే భారీ రిపీట్ వాల్యూను సాధిస్తూ 2 మిలియన్‌కు పైగా లైక్స్‌ను, మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో 60 మిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్‌ను రాబట్టి చార్ట్‌లను ఏలుతోంది. మ్యూజిక్ లవర్స్, సినిమా అభిమానులు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటూ ప్రతి రోజు ప్లేలిస్ట్‌లో తప్పనిసరిగా ఉండే పాటగా మార్చేశారు.