1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Ambati Rambabu gets special device for sleep in jail

అంబటి రాంబాబుకు నిద్ర సమస్య... స్లీప్ అప్నియా పరికరం అమర్చిన జైలు అధికారులు

Ambati Rambabu
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నిద్ర సమస్య ఉంది. దీంతో ఆయనకు స్లీప్ అప్నియా అనే ప్రత్యేక పరికరాన్ని జైలు అధికారులు అమర్చారు. 
 
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని ఉపయోగిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ఉన్నవారిలో నిద్రిస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకునే స్థాయి బాగా తగ్గిపోయి, మళ్లీ కాసేపటికి పునరుద్ధరణ అవుతుది. ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది.
 
ఈ సమస్య ఎపుడు తలెత్తుతుందో ముందుగా అంచనా వేయడం కష్టం కావడంతో నిద్రకు ముందు నుంచే స్లీప్అప్నియా పరికరాన్ని అమర్చుకుని నిద్రిస్తారని వైద్యులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుకు ఈ స్లీప్ అప్నియా పరికరాన్ని జైలు అధికారులు అందించారు. 
తర్వాతి కథనం
AIADMK: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి.. అన్నాడీఎంకే