గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 18 జనవరి 2022 (12:31 IST)

రికార్డింగ్ డాన్సుకు అనుమతి ఇచ్చిన ఎస్సై సస్పెన్షన్

కర్నూలు జిల్లా రుద్రవరంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుళ్లాయప్పను జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నిబంధనలను గాలికొదిలేసి, ఈ నెల పదిహేను రాత్రి చిన్నకంబాలూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రికార్డింగ్ డాన్స్ నిర్వహణకు అనుమతి ఇచ్చారని విచారణలో తేలడంతో రాజ కుళ్లాయప్పను జిల్లాఎస్పీ సస్పెండ్ చేశారు.
 
 
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆళ్లగడ్డ ఏ.ఎస్.పి రాజేంద్ర ఎస్సైకి అందజేశారు. అలాగే రికార్డింగ్ డాన్స్ నిర్వహణపై ఆ గ్రామ పెద్దలను ష్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు విచారణ నివేదికను అందజేయన్నట్లు సీఐ తెలిపారు. పండగ రోజు రికార్డింగ్ డాన్స్ కు ఎస్సై లంచాలు తీసుకుని అనుమతి ఇచ్చారని తేలడం తో ఆయనను సస్పెండ్ చేసారు.