సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 1 జనవరి 2022 (12:55 IST)

వీర‌భ‌ద్రుడి విగ్ర‌హం ధ్వంసం... ఎమ్మెల్యే అనుచ‌రుడిపై అనుమానం

హిందూ దేవ‌త మూర్తుల విగ్ర‌హాల ధ్వంసం ఇటీవల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక చోట విగ్ర‌హాలు ధ్వంసం అవ‌డం, ర‌థాలు కాలిపోవ‌డం జ‌రుగుతున్నాయి. ఇవి చివ‌రికి రాజకీయ వివాదాలకు దారితీస్తున్నాయి. 
 
 
కర్నూలు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో గోశాల భూమిలో ఉన్న వీరభద్ర స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గోశాల భూమిని స్థానిక ఎమ్మెల్యే వ‌ర ప్ర‌సాద‌రావు అనుచ‌రుడు ఒక‌రు కబ్జా చేశార‌ని, ఇపుడు అక్క‌డి విగ్ర‌హాల ధ్వంసం పైనా, ఎంఎల్ఏ అనుచరుడిపై బిజెపి నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 
భూకబ్జా నుంచి గోశాల భూమిని కాపాడి, విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల‌ని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.