జిల్లాకు చేరిన 40,500ల కోవిడ్ వ్యాక్సిన్ల డోస్‌లు

corona vaccine
ఠాగూర్| Last Updated: బుధవారం, 13 జనవరి 2021 (19:36 IST)
సంక్రాంతి పండుగ జిల్లా వాసులకు మంచి ఆరోగ్యకర శుభ గడియను తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ టీకాతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు జిల్లాలో రంగం సిద్ధమయ్యిందని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెల్లడించారు. ఈ నెల 16 న మొదటి విడత కరోనా టీకా పంపిణీని 27 టీకా పంపిణీ కేంద్రాల ద్వారా (వ్యాక్సిన్ సెషన్ సైట్స్) కరోనా యోధులైన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు.

అలాగే, ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న శుభ గడియ వచ్చిందని, జిల్లాకు 40,500ల డోసుల కోవిడ్ వేక్సిన్ భోగి పండుగ నాడు వచ్చిందని, డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉన్న టీకా నిల్వ కేంద్రంలో అన్ని నిబంధనల మేరకు టీకాను ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్స్‌లో డిఎంహెచ్ఓ, డి.ఐ.ఓ ల ఆధ్వర్యంలో భద్రపరచడం జరిగిందని, టీకా నిల్వ కేంద్రం బయట పోలీసు పహారాతో భద్రతను కూడా కల్పించామన్నారు.

సంక్రాంతి పండుగ జిల్లా వాసులకు మంచి ఆరోగ్యకర శుభ గడియను తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్ టీకాతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు జిల్లాలో రంగం సిద్ధమయ్యిందని, ఈ నెల 16 న మొదటి విడత కరోనా టీకా పంపిణీని 27 టీకా పంపిణీ కేంద్రాల ద్వారా (వ్యాక్సిన్ సెషన్ సైట్స్) కరోనా యోధులైన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని.. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న శుభ గడియ వచ్చిందని, జిల్లాకు 40,500ల డోసుల కోవిడ్ వేక్సిన్ భోగి పండుగ నాడు వచ్చిందన్నారు.

డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉన్న టీకా నిల్వ కేంద్రంలో అన్ని నిబంధనల మేరకు టీకాను ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్స్ లో డిఎంహెచ్ఓ, డి.ఐ.ఓ ల ఆధ్వర్యంలో భద్రపరచడం జరిగిందని, టీకా నిల్వ కేంద్రం బయట పోలీసు పహారాతో భద్రతను కూడా కల్పించామని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

మరో వైపు ప్రభుత్వ అదేశాల ప్రకారం ఈ నెల 16 నుండి జిల్లాలో 27 సెషన్ సైట్స్ లో మొదటి విడుదలో హెల్త్ వర్కర్స్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లన్నీ సర్వం సిద్ధం చేశామని, ఇప్పటికే రెండు సార్లు విజయవంతంగా వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను జిల్లాలో నిర్వహించామని,
కోవిడ్-19 వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులు, నియోజకవర్గ నోడల్ అధికారులతో, డాక్టర్లతో తాను, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, కర్నూలు మునిసిపల్ కమీషనర్ పలుమార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించడంతో పాటు వ్యాక్సిన్ నిల్వ కేంద్రం, డ్రై రన్ ను స్వీయ పర్యవేక్షణ, తనిఖీలు చేయడం జరిగిందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. అలాగే, వ్యాక్సినేషన్ విధులు ఉన్న జిల్లా అధికారులు, సిబ్బందికి ఈ నెల 15, 16 న ఎటువంటి సెలవులు ఉండవని, అలాగే ఈ నెల 15న మరోమారు
కోవిడ్-19 వాక్సినేషన్ టాస్క్ఫోర్స్ కమిటీ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నానని కలెక్టర్ తెలిపారు.


అలాగే, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 27 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉంటాయనీ, వాటిలో ప్రతి నియోజకవర్గంలో రెండు సెషన్ సైట్ లు ఏర్పాటు చేశామన్నారు. సెషన్ సైట్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తో మాట్లాడి ఏర్పాట్లు వెంటనే పూర్తి చేసేలా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని నియోజకవర్గ నోడల్ అధికారులను ఇదివరకే ఆదేశించామని కలెక్టర్
తెలిపారు. వ్యాక్సిన్‌ ను భద్రపరిచేందుకు
కోల్డ్‌ స్టోరేజీ సెంటర్ లో 24 గంటలూ విద్యుత్‌ ఉండేలా,
ప్రతి టీకా కేంద్రంలో వెయిటింగ్ హాలు, రిజిస్ట్రేష‌న్ రూము, వేక్సినేష‌న్ రూము, అబ్జ‌ర్వేష‌న్ రూమ్ లలో ఏర్పాట్లన్నీ సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 16 నుండి మొదటి దశలో హెల్త్ కేర్ మరియు అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. రెండవ దశలో ఫ్రంట్లైన్ వర్కర్ లు (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, శానిటేషన్ ఇతర శాఖల సిబ్బంది), 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లు లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు, మూడో దశలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

కోవిడ్- 19 వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా, పగడ్బందీగా చేపట్టడానికి సర్వం సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో సుశిక్షితులైన వ్యాక్సినేషన్ అధికారి 1గా పోలీస్/ మహిళపోలీస్, వ్యాక్సినేషన్ అధికారి 2గా వెరిఫికేషన్ మరియు డేటా ఎంట్రీ కోసం డిజిటల్ అసిస్టెంట్ లేదా వాలంటీర్ ని, వ్యాక్సినేషన్ అధికారి 3గా వ్యాక్సినేషన్ వేసేందుకు ఏఎన్ఎం / జిఎన్ ఎమ్ / డాక్టర్,
వ్యాక్సినేషన్ అధికారి 4గా అంగన్వాడీ వర్కర్ ని, వ్యాక్సినేషన్ అధికారి 5గా ఆశా వర్కర్‌లు ఉంటారని,
వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఎక్కడైనా దుష్ఫలితాలు కలిగితే వారికి వెంటనే వైద్యం చేయడం, లేదా ఆస్పత్రికి తరలించి తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు.

తొలివిడత వ్యాక్సినేషన్ చేసిన తరువాత కోవిడ్ వ్యాక్సిన్ ధృవపత్రం జారీ చేస్తామని దాని ఆధారంగానే 28 రోజున రెండో విడత వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి టీకా కేంద్రంలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలో, తమ మొబైల్ నెంబర్ కు వచ్చిన సంక్షిప్త సందేశం చూయించిన100 మంది వరకు వ్యాక్సినేషన్ వేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :