బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:13 IST)

కర్నూలు జిల్లాలో పరువు హత్య, బైకుపై వెళుతున్న వైద్యుడిపై బండరాళ్లతో దాడి

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆదోని విట్టా క్రిష్టప్పనగర్‌లో ఫిజియో థెరపీ వైద్యుడిని అతి దారుణంగా హత్య చేశారు. పట్టపగలే నడిరోడ్డుపై బైక్ పైన వెళుతున్న డాక్టర్ ఆదాం అస్మిత్‌ను బండరాళ్ళతో కొట్టి చంపారు దుండగులు. రెండు నెలల క్రితం మహేశ్వరిని ప్రేమ వివాహం చేసుకుని విట్టల్ నగర్‌లో నివాసముంటున్నారు ఈ దంపతులు.
 
ఇద్దరిదీ వేరువేరు సామాజిక వర్గం. ఆదాంతో పెళ్ళికి ఒప్పుకోలేదు మహేశ్వరి తల్లిదండ్రులు. హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆదాం..మహేశ్వరి. తన భర్తను తమ తల్లిదండ్రులే హత్య చేశారని మృతుని భార్య మహేశ్వరి ఆరోపిస్తోంది.
 
మోటారు బైక్ పైన వెళుతున్న ఆదాంపై దారి కాచి ముఖంపై బండరాళ్ళ వేసి హత్య చేశారు దుండగులు. మృతుడు దేవి నర్సింగ్ హోంలో ఫిజియో థెరపీ వైద్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. హత్య కాబడిన వ్యక్తి విట్టల్ నగర్‌లో వుండే ఆదాం స్మిత్‌గా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరువు హత్య కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.