సోమవారం, 24 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (17:51 IST)

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

Ram-Lakshman
Ram-Lakshman
యాక్షన్ పరంగా నందమూరి బాలకృష్ణ మూడు క్యారెక్టరైజేషన్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం కల్పించాయని ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2: తాండవం చిత్రానికి వారు పనిచేశారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.  ఎస్ థమన్ సంగీతం అందించారు. అఖండ 2: తాండవం 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
అఖండ 2 ఫైట్స్ ఎంత కొత్తగా ఉండబోతున్నాయి ?
అఖండ కి  మించిన అంచనాలు 'అఖండ 2 పై ఉన్నాయి. అఖండలో బాలకృష్ణ గారి పాత్రని అఖండగా పరిచయం చేశారు. ఇందులో  డైరెక్టర్ బోయపాటి గారు బాలయ్య గారి విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి గారు కూడా అద్భుతంగా నటించారు. డైరెక్టర్ గారు చాలా కొత్త గెటప్ ఇచ్చారు. అతని దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అఖండ పాత్రలో ఉంటుంది. అలాంటి రెండు శక్తులు మధ్య యాక్షన్ ని చాలా కొత్తగా కంపోజ్ చేయడం జరిగింది.
 
-అఖండ కి మించిన స్పాన్, కాన్వాస్  ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీయాలని డైరెక్టర్ గారు మొదటి నుంచే మనసులో పెట్టుకొని ప్రతిదీ చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దారు. చాలా హోంవర్క్ చేశారు. ప్రతి చిన్న విషయంలో 100% ఎఫర్ట్ పెట్టారు. అందరం ప్రేక్షకులకి ఒక గొప్ప  సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో చాలెంజిగా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రేక్షకులు అభిమానులు 100% అంచనాలు పెట్టుకుంటే వెయ్యిశాతం ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది.
 
- టీజర్ ట్రైలర్లో గన్ త్రిశూలం తో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ని చూసే ఉంటారు. మామూలుగా గన్ కే ఒక పవర్ ఉంటుంది. ఆ గన్ కి ఒక త్రిశూలం పవర్, శివుని శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్ తో యాక్షన్ సీక్వెన్స్ ని కంపోజ్ చేయడం జరిగింది.
 
- ఓంకారం శక్తి, శివశక్తిని గుండెల్లో నింపుకుంటే జీవితం ఎంత ఆనందంగా, అద్భుతంగా జరుగుతుందనే విషయాన్ని డైరెక్టర్ బోయపాటి గారు చాలా అద్భుతంగా చెప్పారు.  
 
మీ యాక్షన్ కంపోజిషన్ చూసిన తర్వాత బాలయ్య గారు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు?
-బాలయ్య బాబు గారితో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాము. మేము అంటే బాబు గారికి చాలా నమ్మకం. మేము సింహ లెజెండ్ లాంటి మాస్ క్యారెక్టర్స్ కి ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి ఒక క్యారెక్టర్ కి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీ ని తీసుకుని మేము ఇందులో ఫైట్స్  కంపోజ్ చేశాం.  సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూజ్బంప్స్ వస్తాయి.
 
- బాలయ్య గారు ఒక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని సూట్ కి వెళ్లేవాళ్లం. బాబు గారు క్యారెక్టర్ తగ్గట్టు స్లీవ్ లెస్ లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. ఒక పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే   బాలకృష్ణ గారిని లాంటి నటుడు మనకు ఉండడం మనందరికీ గర్వకారణం.
 
-ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ గారి తప్పితే ఈ క్యారెక్టర్ ని ఇంకెవరు చేయలేరని చెప్పొచ్చు. బాలయ్య గారిని షూటింగ్లో ఎదురుగా చూస్తున్నప్పుడు ఒక దైవ శక్తిని చూస్తున్నట్టుగా ఉండేది.  
 
నిర్మాతల గురించి?
-14 రీల్స్ గోపి గారికి రామ్ గారికి ధన్యవాదాలు. అఖండకు మించి డబల్ త్రిబుల్ స్పాన్ ఉన్న సినిమా ఇది. మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతంగా ఉండాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో అద్భుతంగా తీసుకువెళ్లాలని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ని గొప్పగా తీసేలా ప్రోత్సహించారు. మన దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా శివుడు శక్తి ఇంత అద్భుతంగా ఉంటుందా అని గర్వపడేలా ఈ సినిమా ఉండబోతుంది.
 
-ఈసారి జరిగిన కుంభమేళా హిందూ ధర్మానికి ఒక జ్యోతిలా వెలిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. అలాంటి కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం ఒక అద్భుతమైన అనుభూతి.
 
బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం ఎలాంటి రిస్క్ యాక్షన్ సీక్వెన్స్లు చేశారు?
-బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అభిమానులకు రియల్ గా కనిపించాలి, అభిమానుల్ని అలరించాలనే తపనతో ప్రతి షాట్ ఆయనే చేశారు. ఇందులో 99% ఆయనే చేశారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అటువంటిది. ఆయనే చేయాలి.
 
- ఈ సినిమా కోసం విభూతి కొన్ని టన్నులు వాడి ఉంటాము. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు మన మీద విభూది వర్షం కురిసినట్టుగా అనిపిస్తుంది. అంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్  మంచి వైబ్రేషన్ తో ఉంటారు శివ తత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది. సినిమా చూసి బయటికి వస్తున్నప్పుడు ఒక ధైర్యాన్ని ఫీల్ అవుతాం.
 
యాక్షన్ లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి?
-ఇందులో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం మూడు క్యారెక్టరైజేషన్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ అత్యంతం అలరిస్తుంది.
 
ఇప్పుడు ఇండియన్ సినిమా యాక్షన్స్ లో రకరకాల ఫార్మేట్స్ వచ్చాయి కదా.. మీరు ఎలా అప్డేట్ అవుతుంటారు?
-ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ గా ఉన్నాం కాబట్టే మీరు మాతో ఇప్పుడు మాట్లాడుతున్నారు (నవ్వుతూ) ఇప్పుడు మా ఎమోషన్ లో అప్డేటెడ్ వర్షన్ గా మా అబ్బాయి కూడా వస్తున్నాడు. తన పేరు రాహుల్. త్వరలోనే యాక్షన్ డైరెక్టర్ గా తనని పరిచయం చేస్తున్నాం. తను కూడా చాలా మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటాడు.
 
అఖండలో చక్రం తిప్పే సీన్  చాలా హైలెట్ అయింది కదా అలాంటిది ఈ సినిమాలో ఉంటుందా ?
-కచ్చితంగా అంతకుమించిన యాక్షను ఈ సినిమాలో ఉంటుంది. మేము ఒక సినిమా చేస్తున్నప్పుడు అందులో జనానికి నచ్చిన అంశాలు ఏంటి తర్వాత ఇలాంటి కొత్తదనం ఇవ్వాలనిదాని గురించి ఆలోచన చేస్తాము. అలా ఆలోచిస్తున్నప్పుడు అఖండలో ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కైతే కనెక్ట్ అయ్యారో అంతకుమించి యాక్షన్ ఈ సినిమాలో కంపోజ్ చేయడం జరిగింది.
 
ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫీలో చాలా కాంపిటీషన్ వచ్చింది కదా.. ఎలా ఫీల్ అవుతున్నారు?
-ప్రతి రంగంలో కాంపిటీషన్ ఉండాలి. మనం ఒక్కరమే ఉంటే అహంకారం వస్తుంది. పక్కోడు కూడా ఉంటే భయం వస్తుంది. కొత్త కొత్త స్టైల్స్ రావాలి. దాని నుంచి మేము అప్డేట్ అవ్వాలి. అక్కడి నుంచే క్రియేటివిటీ వస్తుంది.