మంగళవారం, 25 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (16:20 IST)

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

Preethi Pagadala, Pranav Kaushik, Vamsi Pujith
Preethi Pagadala, Pranav Kaushik, Vamsi Pujith
సురేష్‌ ప్రొడక్షన్స్‌  డి.సురేష్‌ బాబు సమర్పణలో పతంగ్‌ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన  ఆయన 'పతంగ్‌' చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు.
 
ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.  సురేష్‌ ప్రొడక్షన్స్‌, డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ' మా చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌, అభిరుచి గల నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో రిలీజ్‌ కానుండటం ఆనందంగా ఉంది. 
 
ఈ  సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా  సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ఆ పంతగుల పోటీ మీలో ఉత్సుకతను కలిగిస్తుంది.  త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. డిసెంబరు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు