1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Dharmendra Passes: Bollywood Legend Dies at 89

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

dharmendra
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు. ఆయన వయసు 89 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత 1935 డిసెంబరు 8వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన ధర్మేంద్ర... 1960లో సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. 
 
ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. యాక్షన్ సీన్స్, స్టైల్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన... 'హీ మ్యాన్ ఆఫ్ ది బాలీవుడ్‌', 'యాక్షిన్ సింగ్' అనే బిరుదులు దక్కించుకున్నారు. 'షో'లే వీరూ పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అలాగే, 'డ్రీమ్ గర్ల్', 'లోఫర్', 'దోస్త్', 'మేరా నామ్ జోకర్' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. నటుడిగా అందరికీ స్ఫూర్తి అయిన ధర్మేంద్ర.. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 
 
అలాగే, ఆయనకు భారత ప్రభుత్వం 2012లో పద్మభూషణ అవార్డును ప్రదాన చేసింది. ధర్మేంద్రకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ప్రకాశ్ కౌర్, హేమమాలిని. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్. వీరిద్దరూ కూడా బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలుగా కొనసాగుతున్నారు. తన నటనతో లక్షలాది మంది భారతీయులను సంపాదించిన ధర్మేంద్ర మృతి యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్రంగా కలచివేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ