సోమవారం, 24 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (16:53 IST)

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Bunny Vas, Vamsi Nandipati
Bunny Vas, Vamsi Nandipati
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 3 రోజుల్లో ఈ సినిమాకు 7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ పై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్, వంశీ నందిపాటి.
 
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - సినిమా మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ చెప్పలేం. కానీ ఈ సినిమాకు మాత్రం కలెక్షన్స్ చెప్పాలని అనిపించింది. ఇప్పటిదాకా మొత్తం 7.28 కోట్ల రూ పాయల కలెక్షన్స్ రాగా, కేవలం నైజాం నుంచే 5 కోట్ల 2లక్షలు వసూలు అయ్యాయి. నిన్న ఒక్కరోజు 2 కోట్ల 17 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణ స్టేట్ లోని మల్టీప్లెక్స్ ల కంటే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీలో మొదటి రెండు రోజులు డల్ గా ఉన్నాయి, నిన్న కలెక్షన్స్ బాగున్నాయి, వైజాగ్ 10 లక్షలు, ఈస్ట్ నుంచి 9 లక్షలు వచ్చాయి. కృష్ణా 12 లక్షలు, గుంటూరు 13 లక్షలు కలెక్ట్ చేసింది. సీడెడ్ కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. లిటిల్ హార్ట్స్ కు కూడా ఇలాగే కలెక్షన్స్ వచ్చాయి. 
 
ఇటీవల సినిమాలకు నైజాం తో చూస్తే ఏపీలో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఐ బొమ్మ క్లోజ్ అవడం వల్ల మా మూవీ కలెక్షన్స్ పెరిగాయి. 99 రూపాయల రేట్ పెట్టడం వల్ల ఫ్లస్ అయ్యింది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మొదట్లో ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు 70 పర్సెంట్ అంతా ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు. సి సెంటర్స్ లో కూడా "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు బాగా వసూళ్లు రావడం ఈ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లింది అనేది ప్రూవ్ చేస్తోంది. మా చిత్రానికి 50 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎక్కువ సెంటర్స్ ఎందుకు ఇస్తున్నారు, లాంగ్ రన్ కిల్ అవుతోంది అని ఓ నిర్మాత నాతో అన్నారు. అయితే చిన్న చిత్రాలకు లాంగ్ రన్ ఆశించకూడదు. వీలైనంత తక్కువ టైమ్ లో ఎక్కువ మంది జనాలకు రీచ్ చేయాలి. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ను నమ్మి చేసిన ఈటీవీ విన్ వారికి నా అభినందనలు. ఇటీవల వారు కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ 90 పర్సెంట్ సక్సెస్ రేట్ తో వెళ్తున్నారు. వంశీ నందిపాటితో నా జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నేను సజెషన్స్ ఇస్తే, తను ఆచరణలో పెడతాడు. నేను సోలోగా చేస్తున్న సినిమాల్లో వంశీ తో ఈ వర్క్ షేర్ మిస్ అవుతున్నా. మిత్రమండలి సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద బాగా ఫన్ ఫీలయ్యాం, ఆ ఫన్ థియేటర్స్ లో ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో ఎక్కడో లోపం జరిగింది. ప్రీ వెడ్డింగ్ షో మా దగ్గరకే వచ్చింది కానీ మేము ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆ మూవీ చేయలేకపోయాం. మా చేతుల్లోకి వస్తే బెటర్ రిలీజ్ చేసేవాళ్లం. అన్నారు.
 
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు ప్రేక్షకులు అందించిన విజయం సంతోషాన్ని ఇస్తోంది. ఈ సినిమా చూస్తూ అమ్మాయిలు ఎమోషన్ కు గురవుతున్నారు. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ మూవీ ఇస్తుందని ఆశిస్తున్నాం. ఏపీతో చూస్తే నైజాంలో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా టీమ్ ఆల్రెడీ థియేటర్స్ విజిట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొత్తం టీమ్ అంతా థియేటర్స్ విజిట్ కు వెళ్తాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి స్క్రీన్స్ యాడ్ చేశాం. ఈ సినిమాను మేము చివరలో తీసుకున్నాం కానీ మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ నమ్మిన ఈటీవీ విన్ వారికి క్రెడిట్ ఇవ్వాలి.

సినిమాతో పాటు క్లైమాక్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుందని నేను నమ్మాను. మల్టీప్లెక్స్ తో పాటు బీ, సీ సెంటర్స్ లో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. వాటిని మనం ఆపలేం. కంటెంట్ ఉన్న సినిమాను ప్రమోట్ చేసుకుని ఆ సినిమాను ఆడియెన్స్ దగ్గరకు చేర్చే ప్రయత్నం చేయాలి. 99 రూపాయల టికెట్ రేట్ పెట్టడం, ఐ బొమ్మ క్లోజ్ కావడం మా సినిమాకు కలిసి వచ్చింది. ఐ బొమ్మలో పైరసీ మూవీస్ చూసేవాళ్లు ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే. ఇప్పుడు ఆ సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్ కు రావడం పెరిగింది. టికెట్ రేట్ 99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అన్నారు.