సోమవారం, 24 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (15:23 IST)

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

Hero Dharma Mahesh and his family
Hero Dharma Mahesh and his family
ఉత్తమ డెబ్యూ గామా అవార్డు గ్రహీత, సింధూరం, డ్రింకర్ సాయి చిత్రాల నటుడైన ధర్మ మహేష్ జిస్మత్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అమీర్‌పేట్‌లో 'జిస్మత్ జైల్ మందీ' పేరుతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌ను ఆయన తనయుడు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రారంభించారు.  మందీ అనగానే భోజన ప్రియులకు 'జిస్మత్' ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామని ధర్మ మహేష్ తెలిపారు. అందుకే మెనూలో నిరంతరం కొత్తదనాన్ని అందిస్తూ, చికెన్, మటన్, చేపలు, పన్నీర్ వంటి శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ అత్యుత్తమ రుచులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
 
ధర్మ మహేష్ మాట్లాడుతూ, 'జిస్మత్' తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టిందని భావోద్వేగంతో తెలిపారు. ప్రస్తుతం 'Gismat' నుంచి 'Jismat'కు బ్రాండ్‌ను మార్చడం వెనుక నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను ఇది సూచిస్తుందని అన్నారు.
 
ఈ పరివర్తన కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, దీనికి మరింత లోతైన భావోద్వేగ బంధం ఉందని ఆయన వివరించారు. ధర్మ మహేష్ కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా తన కుమారుడు జగద్వజకు అంకితం చేస్తున్నారు. అంటే తన కొడుకు కోసం బిజినెస్ మొత్తం జగద్వజ పేరు మీదకు మార్చనున్నారు. ఇక ఈ యాజమాన్యం బదిలీ పూర్తయ్యే వరకు, ఆయన కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తారు.
 
ఇక్కడ వడ్డించే ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి" అని ధర్మ మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిణామం బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.