Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
బాలీవుడ్ లో అలనాటి కథానాయకుడు ధర్మేంద్ర మ్రుతి పట్ల తెలుగు చలన చిత్రపరిశ్రమ స్పందించింది. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ప్రకటన వెలువరించింది. ఫిలింఛాంబర్ తోపాటు అన్ని శాఖల వారూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో ఇలా నివాళులర్పించారు.
ప్రముఖ నటులు శ్రీ ధర్మేంద్ర కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. అందుకే ఆయన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు. షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కి బారాత్ లాంటి చిత్రాలతో నటనలో తనదైన శైలి చూపించారు. 2004 నుంచి అయిదేళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. ధర్మేంద్ర గారి కుమారులు శ్రీ సన్నీ డియోల్, శ్రీ బాబి డియోల్, సతీమణి శ్రీమతి హేమమాలినికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి