సంబంధిత వార్తలు
- నేలపై పాకుతూ వచ్చిన 11 నెలల చిన్నారి.. కారును పైకి పోనిచ్చి..?
- అసోంలో భూకంపం.. మూడుసార్లు కంపించిన భూమి.. వీడియో వైరల్
- లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి నష్టం... ఏపీ సీఎం జగన్
- 18 యేళ్లు నిండినవారికి టీకా ఇవ్వలేం.. తెగేసి చెప్పిన ఏపీ సర్కారు
- ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలానికి నిలువుటద్దం... బైక్పై భార్య మృతదేహంతో...
కుటుంబ కలహాలు.. కన్నబిడ్డను కడతేర్చిన తల్లి
కన్నబిడ్డ పట్ల ఓ తల్లి కిరాతకురాలిగా మారింది. నవమాసాలు మోసి కని పెంచుకున్న ఓ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కాటికి పంపింది ఓ తల్లి. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని రుద్రవరంలో వెలుగు చూసింది. మౌనిక అనే వివాహిత తన రెండేళ్ల కుమారుడి గొంతు కోసి చంపింది. ఆ తర్వాత ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడడానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
