1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 జనవరి 2022 (22:41 IST)

జస్ట్ 2 కోట్లే తేడా... చైనాను దాటేసి నెంబర్ 1 కానున్న 'అఖండ' భారతదేశం

ప్రపంచంలో భారతదేశానికి వున్న ప్రత్యేకతలు సమ్‌థింగ్... సమ్‌థింగ్. యూ ఆర్ ది లీడర్ అని ఇండియాను చాలా దేశాధినేతలు ప్రశంసించారు కూడా. శాంతానికి మారుపేరు. మేధస్సుకు కేరాఫ్ అడ్రెస్ భారత్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...

 
ఇక అసలు విషయానికి వస్తే... ప్రపంచ జనాభాలో మన దేశానిది రెండో స్థానం. బహుశా ఈ ఏడాది కావొచ్చు లేదంటే మరో ఏడాది కావచ్చు... ప్రపంచ జనాభా అత్యధికంగా వున్న దేశంగా భారతదేశం అవతరించబోతోంది. చైనాలో 2020 నాటికి 140.21 కోట్ల జనాభాతో వుండగా భారతదేశ జనాభా 138 కోట్లను చేరుకుంది.

 
జనాభా పెరుగుదలలో భారతదేశ గ్రాఫ్ పైపైకి వెళ్తుంటే... చైనా గ్రాఫ్ కిందకు జారిపోతోంది. ఇదిలాగే సాగితే మరో ఏడాదిలోగా భారతదేశం ఆ విషయంలో చైనాను దాటేయడం ఖాయం. ఇప్పటికే చైనా జనాభాను పెంచుకునేందుకు అక్కడి పౌరులకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తోంది. కానీ పెద్దగా ఫలితాలు రావడంలేదు.