1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (09:23 IST)

సుప్రీంకోర్టులో కరోనా కలకలం : పది మంది జడ్జిలకు కరోనా వైరస్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే, అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. 
 
దీంతో బాధితులను న్యాయసహాయం అందించడం ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికార వర్గాలు వెల్లడిచాయి. అయితే, కరోనా వైరస్ బారినపడిన న్యాయమూర్తుల్లో కేఎం.జోషి, పీఎస్. నరసింహా వంటి మరికొందరు కోలుకున్నారు.