మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీలకు కరోనా పాజిటివ్
Mallikarjun Kharge-Veerappa Moily
ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకా తీసుకున్నారని, అయితే ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు ఇంకా అర్హులు కాలేదని తెలిపింది. అంతేగాకుండా ఢిల్లీలోని ఖర్గే ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
కాగా.. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మేకెదాటు పాదయాత్రలో ఖర్గే పాల్గొన్నారు. కావేరి నదికి అడ్డంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 10 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది.
ఇందులో ఖర్గేతో సహా మరో కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఈ లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం, ఎమ్మెల్యే ఎన్ హెచ్ శివశంకరరెడ్డి వైరస్ బారిన పడ్డారు.
