గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (18:18 IST)

హ్యాపీ బ‌ర్త్ డే ప్రియాంక గాంధీ... కాంగ్రెస్ నేత‌ల వేడుక!

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు  డాక్టర్ సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేశారు.  విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర రత్న భవన్ లో రాష్ట్ర కార్యాలయంలో ప్రియాంకా గాంధీ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసారు. 
 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వళిబొయిన గురునాధం, నగర అధ్యక్షులు నరహారశెట్టి నరసింహ రావు, రాష్ట్ర ఆర్టీఐ చైర్మన్ పివై కిరణ్ కుమార్, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన్నం రాజశేఖర్, రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినటర్స్ తూమాటి బాలు, సనపల రమేష్, నగర కార్మిక సంఘం చైర్మన్ జోసెఫ్, నగర నాయకులు జగన్ తదితరులు పాల్గొన్నారు.