బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (14:07 IST)

మోదీని దించి రాహుల్ గాంధీకి ప‌ట్టం క‌డ‌దాం: రాకేష్ రెడ్డి

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ జ‌రిగింది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి సైకిల్ యాత్ర‌ను ప్రారంబించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌ధాని మోడీ, సీఎం జగన్‌లు ప్రజలను దోచుకుంటున్నార‌న్నారు.

మోడీ పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే... తందానా అంటూ జగన్ పన్నుల భారాలు మోపుతున్నార‌ని, క్రూడ్ ఆయిల్ తగ్గినా... పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించర‌ని ప్ర‌శ్నించారు. పేదల కన్నీళ్లను పట్టించుకోకుండా.. పారిశ్రామిక వేత్త లకు దోచి పెడుతున్నార‌ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలు విసిగిపోయార‌ని, అందుకే వచ్చే ఎన్నికలలో వీరిని సాగనంపేందుకు సిద్దం గా ఉన్నార‌న్నారు. రు
 
ధరలు పెంచితే ప్ర‌జ‌లు మ‌ద్యం మానతారని జగన్ సెలవిచ్చార‌ని, మరి ఇప్పుడు అన్ని రకాల వస్తువుల ధ‌ర‌లు పెంచేశార‌ని యూత్ కాంగ్రెస్ నేత సతీష్ విమ‌ర్శించారు. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు ఆకాశ్శంనంటాయ‌ని, ఇక ప్రజలు‌ అన్నం‌ మానేయాలా, ఇళ్లు కట్టుకోవడం ఆపేయాలా? మాయ మాటలతో ఎల్లకాలం ప్రజలను మోసం‌ చేయలేర‌ని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి కి ఓటు‌ వేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నార‌ని, వచ్చే ఎన్నికలలో ఇటు జ‌గ‌న్ ని అటు మోడీని దించి, రాహుల్ గాంధీ కి పట్టం కట్టడం ఖాయమ‌న్నారు.