సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (12:28 IST)

ఈసారి టీడీపీ గెలిచి తీరుతుంది, బ‌ల్ల‌గుద్ది చెప్పిన ప‌రిటాల శ్రీరామ్

తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖచ్చితమో... వ‌చ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అంతే ఖచ్చితం! అని బ‌ల్ల‌గుద్ది చెప్పారు ప‌రిటాల శ్రీరాం. అమ‌రావ‌తిలోని చంద్ర‌బాబు క్యాంప్ కార్యాల‌యంలో టీడీపీ పోలిట్ బ్యూరో స‌మావేశం సాగుతోంది.

ఇందులో యువ‌కుల‌కు అవ‌కాశాం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అంద‌రితో మాట్లాడిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌రిటాల సునీత కుమారుడు ప‌రిటాల శ్రీరామ్ కు అవ‌కాశం ఇచ్చారు. అంతే... శ్రీరాం ఉద్వేగంగా స్పీచ్ ప్రారంభించాడు. వ‌చ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి  ఖచ్చితంగా వ‌స్తుంద‌ని, రాబోయే రోజుల్లో వైకాపాకి గడ్డుకాలం తప్పద‌న్నారు.

మన పార్టీలో చాలా మంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది ప్రేక్షక పాత్ర వహించే సమయం కాదు. మనందరిపై బాధ్యత ఉంది. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. వైకాపా చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు దోపిడీలకు అడ్డుకట్ట వేయాలి.

ఇది మనందరి కర్తవ్యం. కన్నతల్లి లాంటి ఈ భూమి రుణం తీర్చుకోవాలంటూ ప్ర‌సంగించారు. ఆ స‌మ‌యంలో త‌ల్లి ప‌రిటాల సునీత కొడుకునే చూస్తూ ఉండిపోగా, చంద్ర‌బాబు మాత్రం ఓ క‌ప్పు కాఫీ తాగుతూ గ‌డిపేశారు.