1983 ప్రపంచ కప్ హీరో యశ్‌పాల్ శర్మ మృతి
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు వయసు 66 యేళ్లు. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో యశ్‌పాల్ సభ్యుడిగా ఉన్నాడు.
83 వరల్డ్‌కప్ ఆడిన జట్టు సభ్యుల్లో మరణించిన తొలి క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కావడం విషాదకరం. అంతేకాకుండా యశ్‌పాల్ శర్మ భారత జట్టు తరపున 37 వన్డేలు, 42 టెస్టులు ఆడాడు.
1979 నుంచి 83 మధ్యకాలంలో మిడిల్ ఆర్డర్‌లో ఇండియా టీమ్‌కు కీలక ప్లేయర్‌గా యశ్‌పాల్ బాధ్యతలు నిర్వర్తించాడు. మంచి ఫీల్డర్ కూడా. కొన్నేళ్ల పాటు ఆయన జాతీయ సెలెక్టర్‌గా ఉన్నారు.