నేడు చిత్రం హీరో ఉదయ్ కిరణ్ జయంతి వేడుకలు...
టాలీవుడ్ యువ హీరో ఉదయ్ కిరణ్. పలు చిత్రాల్లో నటించిన ఉదయ్.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 26వ తేదీ ఆయన జయంతి వేడుకలు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, సినీ ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
ఉదయ్ కిరణ్ హీరోగా చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసి, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకుని లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు.
కలుసుకోవాలని, శ్రీరామ్, నీస్నేహం నీకు నేను నాకు నువ్వు, ఔనన్నా కాదన్నా, గుండె ఝల్లుమంది వంటి సినిమాలతో అలరించిన ఉదయ్ కిరణ్ హీరోగా రిలీజ్ అయిన చివరి సినిమా జై శ్రీరామ్ కావడం గమనార్హం.
అయితే, ఉదయ్ నటించిన చివరి సినిమా చిత్రం చెప్పిన కథ… ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాత, ఉదయ్ కిరణ్ అసిస్టెంట్ మున్నా కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.