గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నటనకు గుడ్‌బై చెప్పిన "నువ్వు - నేను" హీరోయిన్

"నువ్వు నేను" చిత్రంలో నటించిన హీరోయిన్ అనిత. ఈమె ఓ బిడ్డకు తల్లి. నిజానికి పెళ్లయిన తర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరం కావాలని ఎప్పటినుంచో భావిస్తూ వస్తోంది. కానీ, బిడ్డకు తల్లి కావడంతో త‌న కుమారుడి సంరక్షణ చూసుకోవడం త‌నకెంతో అవసరమ‌ని తెలిపింది. ఇక‌పై తాను సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని స్ప‌ష్టంచేసింది.
 
అలాగే, భవిష్యత్తులో తిరిగి సినిమాలు, సీరియ‌ళ్ల‌లో న‌టిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా తాను ఇప్ప‌ట్లో చెప్ప‌లేన‌ని తెలిపింది. తాను ఇప్పుడు కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. 
 
కాగా, అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన నువ్వు-నేను సినిమాలో హీరోయిన్‌గా అనిత న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆమె ప‌లు సినిమాల్లో న‌టించింది. నాగిని సీరియ‌ల్ లోనూ న‌టిస్తోంది. ఆమె పారిశ్రామికవేత్త రోహిత్‌ను 2013లో ప్రేమించి, పెళ్లి చేసుకుంది.