గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (16:02 IST)

మా అధ్యక్ష ఎన్నికలు : ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వీరే...

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెళ్లు పోటీపడనున్నాయి. ఇందులో ఒకటి ప్రకాష్ రాజ్ ప్యానెల్. ఈ ప్యానెల్ సభ్యులను తాజాగా ప్రకటించారు. మొత్తం 27 మందితో జాబితాను విడుదల చేశారు. ‘మా’ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాత్మక ఆలోచనలతో ‘మా’ ప్రతిష్టను నిలబెడతానన్నారు. నటీనటుల బాగు కోసం పనిచేస్తానని చెప్పారు.
 
ఈ ప్యానెల్‌లో ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీశ్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవి ప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావులు ఉన్నారు. 
 
ఇదిలావుంటే, అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మొదటి వ్యక్తి మంచు విష్ణు. ఆ తర్వాత తానూ పోటీ చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే జీవితా రాజశేఖర్, నటి హేమలూ బరిలోకి దిగుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరు కాస్తా.. చతుర్ముఖ పోరుగా మారిపోయింది. ఎన్నికలను రసవత్తరంగా మార్చేసింది.