1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (13:03 IST)

ప్రయాణికులకు శుభవార్త .. 24 రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే

దేశంలోని కరోనా కష్టకాలంలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వేశాఖ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం మేరకు.. 24 ప్రత్యేక రైళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న సర్వీసులు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని తెలిపింది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని సీపీఆర్‌ఓ సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. వీటిలో ఆరు రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు సర్వీసులు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి.