గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (13:53 IST)

పలు ప్రత్యేక రైళ్లు రద్దు: జూన్ 11 వరకు రైలు సేవలు నిలిపివేత

కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. విజయవాడ మీదుగా నడుస్తున్న ఎనిమిది రైళ్లను జూన్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు కీలక ప్రకటనలో తెలియజేశారు. 
 
విశాఖపట్నం నుంచి కాచిగూడ వచ్చే ప్రత్యేక రైళ్లును జూన్‌ 1వ తేది నుంచి 10వ తేది వరకు నిలిపివేసింది దక్షిణ మధ్య రైల్వేశాఖ. ఇక కాచిగూడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌–పుణే, పుణే–భువనేశ్వర్‌, అలాగే కడప టూ విశాఖపట్నం, లింగపల్లి నుంచి విశాఖట్నం ట్రైన్లు కూడా రద్దు కాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్‌ చేసింది.
 
ఇక ఇప్పటికే.. పలు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు రద్దు చేస్తున్నట్లు స్పషం చేసింది. 
 
కరోనా ఉధృతి కారణంగా రైళ్లలో రద్దీ తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక యాస్‌ తుఫాన్‌ ప్రభావంతో, దేశవ్యాప్తంగా పలు రైళ్లను ఇప్పటికే క్యాన్సల్‌ చేసింది రైల్వేశాఖ. 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.