గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 మే 2021 (16:06 IST)

#JusticeForSupriya రైలు పట్టాలపై 23 ఏళ్ల యువతి శవం, ప్రమాదమా? అత్యాచారమా?

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
మార్చి నెల 23వ తేదీన ఓ యువతి అహ్మదాబాద్-భోపాల్ మధ్యలోని దావోద్ ప్రాంతంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాధమికంగా తేల్చారు కానీ అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. అసలు ఆ యువతి ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరిగింది?
 
ట్విట్టర్లో హఠాత్తుగా గురువారం నాడు మరణించిన యువతి సుప్రియకు న్యాయం చేయాలని కోరుతూ #JusticeForSupriya హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఆమె మార్చి 2న రైలు పట్టాలపై శవమై కనిపించింది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతూ వుంది.
 
23 ఏళ్ల సుప్రియ ఎంఎస్సీ పూర్తి చేసి సెంట్రల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆమె మార్చి 2న సాయంత్రం అహ్మదాబాద్ లోని తన సోదరి ఇంటి నుంచి భోపాల్ వెళ్లేందుకు రైలు ఎక్కింది. రాత్రి 9:30 నుండి 10:00 గంటల మధ్య, ఆమె తన బావమరిది, కళాశాల స్నేహితులతో సహా పలు వ్యక్తులతో మాట్లాడింది. ఆ కాల్స్ ముగిశాక టాయిలెట్ల వైపు లేచి వెళ్లింది. తన వస్తువులన్నీ తన రైలు సీటుపై వదిలివేసిందని రైలులోని సాక్షులు పేర్కొన్నారు.
 
 
 
ఐతే టాయిలెట్‌కి వెళ్లిన సుప్రియ ఎంతసేపటికీ తన సీటుకు తిరిగి రాకపోవడంతో తోటి ప్రయాణికుడు ఒకరు అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. రైలు గోద్రా దాటిన సమయంలో ఆమె తప్పిపోయినట్లు ఆమె కుటుంబానికి సమాచారం అందింది.
 
 మార్చి 3న ఆమె దాహోద్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఆమె శవం లభ్యమైంది. ఆమె మరణాన్ని ప్రమాదవశాత్తు మరణించిన కేసుగా నమోదు చేయబడింది.
 
 
ఐతే ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె మరణం అనుమానస్పదం కావడంతో ట్విట్టర్లో సుప్రియకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ రోజు రాత్రి ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి రైల్లో నుంచి కిందికి తోసేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.