మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (12:23 IST)

ఎంపీలు పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఇలా మెల‌గండి: జగన్

తాడేప‌ల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరుపుతున్నట్లు తెలిసింది.
 
పార్లమెంట్‌లో విశాఖ ఉక్కుపై పోరాడతామ‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. భేటీకి ముందు ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో విశాఖ ఉక్కుపై పోరాడతామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కోరతామని తెలిపారు. కృష్ణా జలాలపై ఇరురాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కోరతామని పేర్కొన్నారు. దిశ చట్టం ఆమోదం, రాష్ట్ర అంశాలను ప్రస్తావిస్తామని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు.