ఈషా షూటింగ్ లో అరకులో ఓ పురుగు కుట్టి ఫీవర్ వచ్చింది : అఖిల్ రాజ్
హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం ఎంతో ముఖ్యం ఈషా సినిమాలో సౌండ్ డిజైనింగ్ భయంకరంగా ఉంటుంది. అందరూ భయపడే విధంగా ఉంటుంది. నిజంగా హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడలేరేమో.. అని హీరో అఖిల్ రాజ్ అంటున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. డిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ రాజ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి.
- అనుకోకుండా ఈసినిమా విడుదల డేట్ కుదిరింది. రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. అడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిన సినిమా ఇది. దర్శకుడు 'ఈషా' శ్రీనివాస్ రాగా గారు నన్నుఎంపిక చేసుకున్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.
- ఈ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్ అయ్యాను. తప్పకుండా హారర్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే వారికి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ సూపర్భ్. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్ష్ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా లైట్ ప్యాట్రాన్, విజువల్స్, సౌండ్ డిజైనింగ్ బాగుంటుంది. సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
- అరకులో షూటింగ్ పూర్తయిన తరువాత ఓ పురుగు కుట్టి ఫీవర్ వచ్చింది. ఆ తరువాత నెల రోజులు జ్వరం వచ్చింది. అంతే తప్ప ఇంకే మీ అనుకోని సంఘటనలు జరగలేదు.
- వెర్సెటైల్ యాక్టర్‌గా అనిపించుకోకుడం నాకు ఇష్టం. ఇన్ని రోజులు రాజు అనే పాత్రలో ఉన్నాను. ఇక ఆ పాత్ర నుంచి వినయ్ రోల్‌లో త్వరలో కనిపిస్తాను. ఈ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కంప్లీట్ డిఫరెంట్ రోల్స్.. హారర్ అంటే ఇమేజినేషన్ కేటగిరి. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సఖియా అనే వెబ్‌సీరిస్ సంబంధించి గ్లింప్స్ చూసి దర్శకుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. నాకు ఈ సినిమాతో ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది, అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.
రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ మీ లైఫ్‌ను ఎలా మార్చింది?
నాలైఫ్‌ను చాలా మార్చింది. ఎప్పటికి ఆ సినిమాకు, ఆసినిమా టీమ్‌కు రుణపడి ఉంటాను. నాకు ఓ ఫేస్‌ను ఇచ్చింది. అఖిల్‌రాజ్‌కు గుర్తింపు ఇచ్చింది. ఇది నాకెరీర్‌లో స్పెషల్ ప్రాజెక్ట్.
మీకు దెయ్యాలు ఆత్మలంటే భయము ఉండేదా?
చిన్నప్పుడు నుంచి నాకు భయం ఉండేది. ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ భయం పోయింది. నైట్ టైమ్ సుసుకు వెళ్లిన భయపడేవాడ్ని. ఇప్పుడు ఆ భయమే లేదు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. భద్రి దర్శకుడు. రాజు వెడ్స్ రాంబాయి తరువాత చేస్తున్న సినిమా ఇది.