దుగ్గిరాల ఎంపీపీ ఉప ఎన్నికలపై హైటెన్షన్
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై హైటెన్షన్ నెలకొంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా పార్టీల్లో ఉత్కంఠత నెలకొంది. ఇరు పార్టీల తరపున గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో ఇరు పక్షాల నేతలు నిమగ్నమైవున్నారు. ఎంపీపీ సభ్యులందరినీ శిబిరాల్లోకి తరలించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వీరిని తిరిగి ప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకుంటున్నారు.
వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (వైకాపా) తరపున 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కానీ వీరిలో ఐదుగురు మాత్రమే ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
వైకాపా రెబెల్ అభ్యర్థి తాడిబోయిన పద్మావతి ఆర్కేతో పాటు హాజరుకాలేదు. ఎంపీపీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆమెను ఆళ్ళ రామకృష్ణారెడ్డి బుధవారం వైకాపా క్యాంపుకు తరలించారు. దీంతో ఆమె రాకపై ఉత్కంఠత నెలకొంది.
అదేవిధంగా టీడీపీకి చెందిన ఎంపీటీసీలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో దుగ్గిరాల బయలుదేరారు. టీడీపీకి జనసేన పార్టీ ఎంపీటీసీ సాయి చైతన్య కూడా మద్దతు ప్రకటించారు. పైగా, ఎన్నికల సంఘం ఆదేశం మేరకు టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించారు.