శోభనం అంటే భయం.. కృష్ణానదిలో దూకి వరుడు ఆత్మహత్య
పెళ్లైన కొత్త.. శోభనం అంటేనే ఎగ్సైట్ మగాళ్ల మధ్య.. ఓ వరుడు శోభనానికి జడుసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11న వివాహం జరిగింది. 12వ తదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళిపోయాడు.
నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన తెనాలిలో శోభనం ఏర్పాటు చేశారు. ఇందుకోసం తెనాలికి వస్తుండగా.. బస్టాండుకు రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు.
రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని తెనాలి వెళ్లిపోయారు.
ఇంతలో కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందన పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి వచ్చి గుర్తు పట్టడంతో మృతదేహాన్ని అప్పగించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.