గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:15 IST)

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ సీఎం బర్త్ డే విషెస్

ys jagan
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా జగన్ విషెస్ తెలిపారు. "చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
 
ఇక చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జ‌న్మ‌దినం సందర్భంగా పార్టీ అభిమానులు ఓ ప్ర‌త్యేక గీతాన్ని రూపొందించారు. చంద్ర‌న్నా, పెద్ద‌న్నా అంటూ సాగే ఈ గీతం ప్రోమోను టీడీపీ త‌న అధికారిక‌ ట్విట్ట‌ర్ ద్వారా విడుదలైంది. 
 
ఈ ప్రోమో పార్టీ శ్రేణుల‌నే కాకుండా సామాన్య జ‌నాన్ని కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సినిమా పాట‌ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ గీతం వుంది.