బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (11:37 IST)

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలి : సీబీఐ

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయాన్ని కోరింది. 
 
ముఖ్యంగా, అక్రమాస్తులతో పాటు సీబీఐ కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి తరపు గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ స్పందించింది. 
 
జగన్ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిన విచారణాధికారి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారని, కాబట్టి సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేకపోయామని నిన్న ప్రత్యేక కోర్టుకు తెలిపింది. 
 
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత గడువు కావాలని కోరింది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.