సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (10:51 IST)

విశాఖకు బయలుదేరిన సీఎం జగన్... హర్యానా సీఎంతో భేటీ!

ys jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 10 గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11 గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. 
 
అక్కడి నుంచి 11 గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌‌తో భేటీ అవుతారు. భేటీ అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
 
నిజానికి హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ నేచురోపతి చికిత్స కోసం విశాఖపట్టణంకు వచ్చారు. ఆయన్ను సీఎం జగన్ కలుసుకోవడం ఆసక్తిగా ఉంది. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఖట్టర్ అత్యంత సన్నిహితుడు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం వెనుక ఏదేని రాజకీయ కోణం ఉందా? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.