ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (10:02 IST)

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భానుడి ప్రతాపంతో ఎండ వేడి నుండి ప్రజలకు ఈ వర్షం చల్లటి ఉపశమనం కలిగించింది. 
 
తూర్పుగోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
 
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరవకొండలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలలో చెట్లు, కటౌట్ లు నెలకొరిగాయి. 
 
కుడేరు మండలం చోళ సముద్రం గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది భారీ శబ్దం‌తో పడిన పిడుగు దెబ్బకు జనం హడలిపోయారు. ఐతే ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు కానీ చెట్టు మొత్తం భారీగా మంటలు చెలరేగాయి.