శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:40 IST)

ఆలయ దర్శనాల్లో వీఐపీ సంస్కృతిని పక్కనబెట్టలేం : మంత్రి కొట్టు

apmap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్తగా మంత్రి పదవిని దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన మంత్రిపదవిని చేపట్టినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా దేవాదాయ శాఖలో అవినీతి ఉందంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖలో అవినీతి వాస్తవమేనంటూ అంగీకరించారు. తాను మాత్రం ఈ శాఖ నుంచి అవినీతిని నిర్మూలించే దిశగా పని చేస్తానని తెలిపారు. అంతేకాకుండా, ఇకపై దేవాలయ దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మంత్రి వీఐపీలను ఒకేసారి పూర్తిగా పక్కనపెట్టడం సాధ్యంకాదని చెప్పారు.