సంబంధిత వార్తలు
- కేటీఆర్ ఫైర్.. దగాకోరు.. రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకోండి
- దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నాడా? కేటీఆర్ ప్రశ్న
- కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.. షెడ్యూల్ వివరాలు ఇవే
- తెలంగాణ మంత్రి కేటీఆర్ దంపతులతో మేఘాలయ సీఎం భేటీ
- రేప్ పార్టీలో ఒక్క ధనవంతుడి బిడ్డపైనా కేసు నమోదు కాలేదు : అసదుద్దీన్ ఓవైసీ
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య - మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేపట్టాల్సిన ఖమ్మం జిల్లా పర్యటన రద్దు అయింది. ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక పోలీసులే కారణం అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు.
నిజానికి మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మంలో పర్యటించాల్సివుంటుంది. ఈ-కామర్స్‌పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా సోమవారం జరగాల్సివుంది. ఈ కారణాల కారణంగానే మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దు అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
